పదవి కోసం వదిలేశాను

వాజ్‌పేయ్‌ ప్రభుత్వం పడిపోవడంతో సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలనుకోవడం వల్లే తాను 1999లో కాంగ్రెస్‌ను వీడానని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వెల్లడించారు. ఆ సమయంలో తాను లేక మన్మోహన్‌సింగ్ మాత్రమే ఆ పదవికి అర్హులమని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పుణెలో మహరాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన తన అభిప్రాయాలను ఈ విధంగా బయటపెట్టారు. 1999లో జరిగిన సంఘటనలను ఆయన థాకరేతో పంచుకున్నారు. అప్పట్లో మీడియాలో వెల్లడైన నివేదికల ప్రకారం.. ‘వాజ్‌పేయ్‌ ప్రభుత్వం పడిపోవడంతో సోనియాగాంధీ ప్రధాని కావాలనుకున్నారు. అందుకే నేను కాంగ్రెస్‌ను వీడాను’ అన్నారు. అయితే భాజపాకు కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని ఆయన అన్నారు. ‘ గత కొంతకాలంగా రాహుల్‌లో చాలా మార్పు వచ్చింది. దేశం మొత్తం పర్యటిస్తూ ప్రజలతో మమేకమవడం, నేర్చుకోవాలనే తపన రాహల్‌లో కనిపిస్తున్నాయి’ అన్నారు. లోక్‌సభలో జవహర్‌లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ను మోదీ విమర్శించిన విషయాన్ని గుర్తుచేస్తూ..ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. ముంబయి నుంచి అహ్మదాబాద్‌ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్‌ గురించి కూడా వీరి మధ్యకు చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి డోక్లా (వంటకం పేరు)తినడానికి ప్రజలు ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ రైల్లో వెళ్లి రావొచ్చు కదా అని ఠాక్రే వ్యంగ్యంగా ప్రశ్నించగా.. అక్కడి నుంచి ముంబయి వచ్చి కూడా తినొచ్చు అని పవార్‌ సమాధానమిచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com