పదవీ పాయె! పాసుపోర్టు పాయె!

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డులను అధికారులు రద్దు చేశారు. దేశ ద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్‌ పాస్‌పోర్టు, గుర్తింపుకార్డులను రద్దు చేయాలని ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆయనపై ప్రస్తుతం ప్రయాణ నిషేధం ఉంది. ఆయన దుబాయిలో ఉండటం కూడా చట్ట విరుద్ధమని కోర్టు వెల్లడించింది. ఆయన ఇప్పుడు రాజకీయ ఆశ్రయం కోరవచ్చు లేదా పాకిస్థాన్‌కు తిరిగి రావాలనుకుంటే అందుకు తగిన డాక్యుమెంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో 2007లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినందుకుగానూ, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గృహనిర్బంధం చేసినందుకు, వంద మందికి పైగా జడ్జిలను తొలగించినందుకు ఆయన దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ముషారఫ్‌ 2016 మార్చి 18న వైద్య చికిత్స కోసం దుబాయికి వెళ్లారు. తర్వాత కొన్ని నెలలకు ప్రత్యేక న్యాయస్థానం ఆయనను నేరస్థుడిగా ప్రకటించి ప్రయాణ నిషేధం విధించింది. కోర్టు ఈ ఏడాది మార్చిలో ముషారఫ్‌ కంప్యూటరైజ్డ్‌ నేషనల్‌ ఐడెంటిటీ కార్డును, పాస్‌పోర్టును రద్దు చేయాలని ఫెడరల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com