పరగడుపున ఓ పండు. చాలా మంచిది ఫ్రెండు.

ఆఫీస్‌ సమయాలలో హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా పనిచేయాలని మనసులో అనుకుంటే సరిపోదు. అందుకోసం మంచి నిద్ర, ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామంతోపాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే సరి. పనిచేయడానికి అధికశక్తి రావడమే కాదు. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మరి ఆ ఆహార సూత్రాలేమిటో తెలుసుకుందాం.
**జంక్‌ఫుడ్‌కి దూరంగా
ఆఫీస్‌ చుట్టూ ఎన్నో రకాల స్నాక్స్‌, ఫుడ్స్‌ నోరూరిస్తూ ఉంటాయి. అయినా మనం జిహ్వచాపల్యానికి అడ్డుకట్ట వేయాల్సిందే. ఎందుకంటే జంక్‌ఫుడ్‌ తినడంవల్ల పనిపట్ల అప్రమత్తంగా ఉండలేకపోతాం. తీపి పదార్థాలు తొందరగా శక్తినిస్తాయి. కానీ అంతే తొందరగా హానీ కలిగిస్తాయి. కాబట్టి పోషకాహారం తీసుకోవడం మంచిది.
**ఫలహారం తప్పనిసరి
చాలామంది ఉదయం ఏం తినకుండా ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరమే కాదు, మన ఆఫీస్‌ పనికి ఆటంకం కూడా. కాబట్టి తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ తినాలి. అయితే తినమన్నారు కదా అని ఏది పడితే అది తినేయకుండా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. పళ్లరసం, ప్రొటీన్‌ షేక్‌, ఏవైనా పళ్ల ముక్కలు తీసుకుంటే మంచిది.
**కొద్దిగా మీల్స్‌
రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి స్థిరంగా ఉండాలంటే కొద్ది కొద్ది ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలి. అలా కాకుండా ఆహారం తినకుండా ఉంటేే షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. మరీ ఎక్కువగా తింటే పెరిగే అవకాశం కూడా ఉంది.
**పరిగడపున ఓ పండు
పండ్లు ఏవైనా రోజంతా శక్తినిస్తాయి. పళ్లలో ఉండే ఫైబర్‌, కాంప్లెక్స్‌ షుగర్స్‌ సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉదయమే పాలు, కోడిగుడ్డు వంటివాటికంటే ఏదైనా పండు తినడం ఆరోగ్యానికి మంచిది.
**తృణధాన్యాలు
గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతాం.
**మాంసం తగ్గించండి
మాంసంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్స్‌ కూడా అధికంగా ఉంటాయి. జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అయితే మాంసం మంచిదే అయినా ఎక్కువమొత్తంలో తీసుకోవడంవల్ల సోమరిగా తయారవుతారు. మాంసం తినడాన్ని తగ్గించాలి.
**నీరు
సరిపడా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు శక్తినిచ్చే పోషకాలు శరీరమంతటా విస్తరించడానికీ నీరు ఉపయోగపడుతుంది. నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. చివరకు గుండె నుంచి రక్త సరఫరా కష్టమవుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com