పరాజయం పాలైన కొల్లా సుబ్బారావు

వర్జీనియా రాష్ట్రంలోని 87వ జిల్లా ప్రతినిధిగా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ప్రకాశం జిల్లా ప్రవాసుడు కొల్లా సుబ్బారావు(11180) పరాజయం పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జాన్ బెల్(18148) చేతిలో 6968 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. విద్యా, ఆరోగ్య, రవాణా, వాణిజ్య రంగాలను బలోపేతం చేస్తాననే వాగ్దానాలతో ప్రచారాన్ని సాగించిన సుబ్బారావుకు ప్రవాస భారతీయులు, తెలుగువారి నుండి భారీ మద్దతు లభించింది. తెలుగువారు వర్జీనియాలో అధికంగా నివసిస్తున్నప్పటికీ స్థానికుల బలాబలాలు ఎదుట వీరి శక్తి చిన్నబోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధివిధానాలు, రిపబ్లికన్ పార్టీ పట్ల వ్యతిరేకత వంటివి కూడా సుబ్బారావుకు వ్యతిరేక పవనాలుగా వీచి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో వర్జీనియ రాష్ట్రాన్ని డెమొక్రాటిక్ పార్టీ 49.73% ఓట్లతో కైవసం చేసుకోగా, రిపబ్లికన్ పార్టీకి 44.1% మాత్రమే ఓట్లు లభించాయి. తన ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ ప్రణాళికలు సుదృఢంగా నిర్మించుకుంటానని కొల్లా తెలిపారు. తనకు ఫోను చేసి అభినందించినందుకు, గట్టి పోరాట పటిమ కనబరిచినందుకు గానూ సుబ్బారావుకు విజేత జాన్ బెల్ అభినందనలు తెలిపారు. 2015 ఎన్నికల్లో జాన్ బెల్ విజేతగా నిలిచారు. ఈ ఏడాది ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి మరోసారి విజయాన్ని అందుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com