పవనే విడాకులు అడిగాడు

నటి రేణూ దేశాయ్‌ తన మాజీ భర్త, కథానాయకుడు పవన్‌ కల్యాణ్ నుంచి విడిపోయి ఏడేళ్లు అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు విడిపోవడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత నటి అన్నా లెజినోవాను పవన్‌ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పవన్‌, రేణు కలిసి తమ పిల్లలు అకీరా నందన్‌, ఆద్యల బాధ్యత చూసుకుంటున్నారు. పవన్‌ ఇప్పుడు తనకు మంచి స్నేహితుడని రేణు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్‌తో విడాకులకు కారణం ఏంటని ప్రశ్నించగా.. తొలిసారి సమాధానం చెప్పారు. ‘కల్యాణ్‌ గారు విడాకులు అడిగారు. నాకు చాలా బాధేసింది, కోపం వచ్చింది. ఆయనకు విడాకులు ఇవ్వాలని నాకు ఏ మాత్రం లేదు. కానీ ఆయన అడగటంతో.. చివరికి ఒప్పుకుని ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు రేణు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com