పవన్ పేరు చెప్పి బెదిరిస్తున్నారు

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్‌ చేయాలని అభిమానులు తనను బెదిరిస్తున్నారని అంటున్నారు నటి రేణూ దేశాయ్‌. ఓ వ్యక్తి పవన్‌ గురించి తప్పుగా పేర్కొంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి స్పందిస్తూ ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా జీవితం ప్రశాంతంగా ఉండడానికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడాలని అనుకున్నాను. కానీ జీవితంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అంటూ నేను చేయని తప్పులకు నిందిస్తున్నవారి గురించి పట్టించుకోవద్దని కొందరు నాకు సలహా ఇచ్చారు. నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా కోసం నేను మాట్లాడుతుంటే అన్నీ మౌనంగా భరించాలని చెప్పారు. పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని మరికొందరు అన్నారు. ఇప్పుడేమో ఓ నీచుడు పవన్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో పెడుతూ నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నాడు. దాంతో నా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌బాక్స్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. కొందరేమో పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒక రోజు నాకంటూ మనశ్శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. మరో విషయం గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు’ అని పేర్కొన్నారు రేణు. ఇటీవల రేణు.. తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గోవాలో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయంలోనూ తనకు పవన్‌ అభిమానుల నుంచి బెదిరింపులు, విమర్శలు వస్తున్నాయని రేణూ వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com