పాక్ కళాకారులకు వీసాలు

శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోన్న ‘మామ్‌’ చిత్రంలో నటించడానికి భారత్‌కు వచ్చేందుకు గాను పాకిస్థాన్‌ నటులు అద్నాన్‌ సిద్ధికీ, సజల్‌ అలీకి భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేసింది. రవి ఉద్యవర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీదేవి భర్తగా అద్నాన్‌, కుమార్తెగా సజల్‌ నటిస్తున్నారు. ఉరీ ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌లో పాక్‌ కళాకారుల పాత్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పాక్‌ నటీనటులు ఉన్న ఏ దిల్‌ హై ముష్కిల్‌, రయీస్‌ల గురించి తీవ్ర చర్చ జరిగింది. క్రమంగా పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఏ దిల్‌హై ముష్కిల్‌ ప్రశాంతంగా విడుదలైంది. త్వరలో రయీస్‌ కూడా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘మామ్‌’ సినిమా షూటింగ్‌కి కూడా అవరోధాలు తొలగాయి. ఈ చిత్రంలో నటించేందుకు అడ్నన్‌, సజల్‌కు భారత్‌ వీసాలు మంజూరు చేసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని పెంచుతుందని ఆశిస్తున్నట్లు పాకిస్థాన్‌ నిర్మాత మహ్మద్‌ మండ్వివాలా అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com