పాత్రికేయ రొద మహాభారతం నుండి ఉంది

సాంకేతికత భారత్‌కు కొత్తేమీ కాదని, పురాతన కాలం నుంచే ఇక్కడ అందుబాటులో ఉందని కొందరు భాజపా నేతలు వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మధ్య త్రిపుర సీఎం విప్లవ్‌కుమార్‌ దేవ్‌ మాట్లాడుతూ.. మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్నెట్‌ ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో భాజపా నేత చేరారు. మహాభారత కాలం నుంచే పాత్రికేయం ప్రారంభమైందని ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి ఒకరు అన్నారు. యూపీలోని మధురలో బుధవారం ‘హిందీ జర్నలిజం డే’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాభారత కాలం నుంచే పాత్రికేయ వృత్తి ప్రారంభమైందన్నారు. ఇందుకు ఆయన ఉదాహరణ కూడా ఇచ్చారు. ‘కురుక్షేత్రం సమయంలో చూపులేని ధృతరాష్ట్రుడికి ఆయన రథసారధి సంజయుడు యుద్ధం గురించి సవివరంగా చెప్పాడు. దీన్ని ప్రత్యక్ష ప్రసారం కాదంటారా? కాకపోతే మరేంటీ?’ అని శర్మ వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత నారదుడిని గూగుల్‌తో పోల్చారు శర్మ. ‘మీ గూగుల్‌ ఇప్పుడే ప్రారంభమైంది. కానీ మా గూగుల్‌ ఎప్పటి నుంచో ఉంది. నారదముని ఓ సమాచార గని. ఆయన ఎక్కడికైనా ఏ విషయాన్నైనా చేరవేయగలరు’ అని శర్మ వ్యాఖ్యానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com