పారిస్ హోటల్‌లో గొడ్డలితో బెదిరించి 30కోట్లు చోరీ

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో భారీ దోపిడీ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత హోటల్లోకి కొందరు దుండగులు ఆయుధాలతో చొరబడి.. రూ.30కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. హోటల్‌లో ఆభరణాల ప్రదర్శన జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పారిస్‌లోని ప్లేస్‌ వెండోమ్‌లో గల ప్రఖ్యాత రిట్జ్‌ హోటల్‌లోని ఓ గదిలో ఆభరణాల ప్రదర్శన జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత నగల తయారీదారులు తమ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. బుధవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో ఆ గదిలోకి చొరబడ్డారు. అక్కడి వారిని బెదిరించి ఆభరణాలను బ్యాగులో నింపుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com