పాల కన్నా అధిక కాల్షియం

సజ్జలు సంతులిత ఆహారం. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేమిటంటే…సజ్జల్లో ఎమినోయాసిడ్లు, విటమిన్లతోపాటు థెరపిటిక్‌ గుణాలు ఉన్నాయి. యాంటాక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి. అందుకే సజ్జలను తినడం వల్ల క్యాన్సర్‌, ఆర్థ్రరైటిస్‌, గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చు.చిన్నారులకు సజ్జలను మెత్తటి పొడిలా చేసి ఫుడ్‌గా పెట్టొచ్చు. ఇవి తొందరగా జీర్ణమవుతాయి. ఎంతో శక్తినిస్తాయి.సజ్జలు శరీరంలో ఐరన్‌ లోపాన్ని ,రక్తహీనతను తగ్గిస్తాయి. ఐరన్‌ లోపం ఉంటే మానసిక పెరుగుదల క్షీణిస్తుంది. తొందరగా అలసిపోతుంటారు. ముఖ్యంగా ఈ సమస్యలను స్త్రీలు బాగా ఎదుర్కొంటున్నారు. ఇది వారికి పుష్టికరమైన ఆహారం.బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను పెరగకుండా సమతులంగా ఉంచుతుంది. వీటిల్లో పీచుపదార్థం బాగా ఉండడంతో జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది.సజ్జలు తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా శరీరం తీసుకునే కాలరీలు కూడా తక్కువ ఉంటాయి. వీటిల్లోని పీచుపదార్థాలు వల్ల లావు తగ్గే అవకాశాలున్నాయి. కొలెస్ట్రాల్‌ పరిమాణం తగ్గుతుంది. కారణం సజ్జల్లో ఉండే ఫైటిక్‌ అనే రసాయనం కొలెస్ట్రాల్‌ సరిగా జీర్ణమయ్యేలా చేసి శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని సమతులం చేస్తుంది.మలబద్దకాన్ని పోగొడుతుంది. మలబద్దకంతో బాధపడుతున్న చిన్నారులకు సజ్జలతో చేసిన పదార్థాన్ని పెడితే ఆ సమస్య నుంచి చిన్నారులు బయటపడతారు. నిత్యం తగు పాళ్లల్లో సజ్జలను ఏదో రూపంలో తీసుకుంటే శరీరం సాంత్వన పొందుతుంది. నిద్ర హాయిగా పడుతుంది. సజ్జలతో లైట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటే రోజంతా తలనొప్పి, ఒత్తిడిలు లేకుండా హాయిగా ఉంటుంది.పాలిచ్చే తల్లులు తమ డైట్‌లో సజ్జలు కూడా చేర్చి రోజూ తినడం వల్ల తల్లిపాలు వృద్ధిచెందుతాయి. అంతేకాదు పాలల్లో ఉన్న కాల్షియం కన్నా మూడు రెట్లు కాల్షియం మనం తీసుకునే సజ్జల్లో ఉంది. అందుకే రోజూ తీసుకునే డైట్‌లో సజ్జలు ఉంటే తల్లి, బిడ్డలిద్దరికీ ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పులకు, ఇరిటేషన్‌, మూడ్‌స్వింగ్స్‌ తదితర సమస్యలకు సజ్జలు తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com