పాస్తా ఆరోగ్యానికి మంచిదే

పాస్తా…పిల్లలకు భలే ఇష్టం. ఆకలి తొందరగా వేయదని పెద్దవాళ్లు కూడా దీన్ని తింటున్నారు. పాస్తా వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..పాస్తాలో ఫ్యాట్‌, ఉప్పు రెండూ తక్కువగా ఉంటాయి.కొలస్ట్రాల్‌ ఉండదు. ఫోలిక్‌ యాసిడ్‌ బాగా ఉంటుంది.ఎనర్జీ పెరుగుతుంది.ఆరోగ్యకరమైన ఫుడ్స్‌లో ఇది ఒకటి.కడుపునిండుగా ఉండి తరచూ ఆకలి వేయదు.దీంతో చిరుతిళ్లు తినం. బరువు పెరగం.పాస్తా ఎపిటైజర్‌ కూడా. దీన్ని సైడ్‌ డిష్‌గా, మెయిన్‌ డిష్‌గా తినొచ్చు.సలాడ్‌, డెజర్ట్‌, బ్రేక్‌ఫా్‌స్టగా కూడా దీన్ని తీసుకోవచ్చు.గోధుమ పాస్తా లేదా ధాన్యాలతో చేసిన పాస్తా ఆరోగ్యానికి మంచిది.ఇది కడుపు, పెద్దప్రేవు కాన్సర్లను నిరోధిస్తుంది.సోడియం ప్రమాణాలు ఇందులో తక్కువగా ఉంటాయి కాబట్టి గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి వాటి బారిన తొందరగా పడము. పాస్తా బ్లడ్‌ షుగర్‌ను క్రమబద్ధీకరిస్తుంది.పాస్తాలో ప్రయోజనకరమైన పిండిపదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఫ గోధుమ పాస్తాలో పీచుపదార్థాలు అఽధికంగా ఉన్నాయి.శరీరంలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటే క్రానిక్‌ జబ్బుల బారిన పడం.జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది.వైట్‌, హోల్‌వీట్‌ పాస్తాలలో మాంగనీసు, సెలీనియం, ఖనిజాలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన రెసిపీల తయారీకి పాస్తా బాగా ఉపయోగపడుతుంది. కాయగూరలు, ప్రొటీన్లతో కూడిన గింజలు, మిరియాలు, కాప్సికం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటితో, అలాగే తులసి, టొమాటో సాస్‌తో పాస్తా తింటే ఎంతో ఆరోగ్యం.కోల్డ్‌ సలాడ్‌లలో కూడా పాస్తా వేసుకుని తింటే మంచిది.పాస్తాలో పోషకపదార్థాలు ఎక్కువ కాబట్టి ఎనర్జీగా ఉంటాం.పాస్తా సమతుల ఆహారం.మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.యాంటాక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో బాగా ఉన్నాయి.శరీరాన్ని దృఢంగా ఉంచే ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com