పిల్లలకు నెయ్యి పెట్టండి

ఒకప్పటి రోజుల్లో చాలా మందికి నేతి చుక్క కలవనిదే ముద్ద గొంతులో దిగేది కాదు. పల్లెటూర్లలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసమనే ఒక ఆవును ఇంటి ఆవరణలోకి తెచ్చిపెట్టుకొనేవారు. దానికి కావలసిన అన్ని సదుపాయాల నందిస్తూ వాటి ద్వారా ఎన్నో లాభాలను పొందేవారు. నెయ్యిలో ఎన్నో రకాల పోషకాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. నెయ్యి శరీరములోని ప్రతిస్థాయిలో కణజాలాలకు బలాన్ని చేకూరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది . రోజుకు 2 – 3 స్పూన్లు నెయ్యి తీసుకుంటే శరీర వ్యవస్థ చక్కగా హార్మోనైజ్‌ అవుతుంది. నెయ్యిలో శ్వాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉన్నందున కొలెస్ట్రాల్‌ని బాగా తగ్గిస్తుంది.నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను ఇది బయటకు పంపుతుంది.రెగ్యులర్‌ డైట్‌లో పిల్లలకు పాలలాగే మరికొన్ని పోషకాహారాలలో నెయ్యి ఒకటి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పిల్లలకు దానిని అందివ్వడం ద్వారా వారు చాలా తేలికగా జీర్ణించుకోగలుగుతారు ,శిశువు ఆరు నెలల వయసుు నుంచి కూడా నెయ్యిని పౌష్టికాహారంగా అందివ్వొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిన్నారు. ఇందులో ఫ్యాట్‌ ఎక్కువ. కాబట్టి కొంత పరిమితిలో మాత్రమే ఇవ్వాలి . మితంగా పెట్టడం వల్ల శిశువులో పోషకాలు సమతుల్యం అవుతాయి. శిశువు ఎదుగుదల రేటు బాగుంటుంది. నెయ్యిలో ఉండే శ్యాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్స్‌ చాలా సులభంగా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. చిన్నపిల్లలు రెడ్‌ మీట్‌, ఇతర ఫ్యాట్‌ ఫుడ్స్‌ను జీర్ణం చేసుకోవడానికి కష్టం అవుతుంది.కాబట్టి, ఫ్యాట్‌ఫుడ్స్‌ నుండి పొందే క్యాలరీలను నెయ్యి నుండి చిన్నపిల్లలు పొందుతారు. దాంతో వారు రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. నెయ్యి ల్యాక్టోజ్‌ షుగర్స్‌ను విచ్ఛిన్నం చేయడానికి బాగా సహాయపడుతుంది . కాబట్టి ల్యాక్టోజ్‌ లోపం ఉన్న పిల్లలకి నెయ్యిని రెగ్యులర్‌గా అందివ్వడం చాలా మంచిది. నెయ్యిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, మెదడు వికాసానికి సహాయపడతాయి. పిల్లలకు అందించే రెగ్యులర్‌ డైట్‌లో నెయ్యిని చేర్చడంవల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. మెదడు అభివృద్ధి వేగవంతమవుతుంది. నెయ్యిలో డి.హెచ్‌.ఏ., ఇ.పిఏలతో పాటు విటమిన్లు అధికంగా ఉండి, మెదడు వికాసానికి తోడ్పడతాయి.పిల్లల ఎదుగుదలకు తల్లిపాలలోని ఫ్యాట్‌ మంచి మూలం. అయితే శిశువు ఎనిమిదో నెలలో అడుగుపెట్టగానే మరింత అదనంగా ఎనర్జీ, క్యాలరీలు అవసరమవుతాయి . నెయ్యి అందించడం వల్ల వారి శరీరానికి అవసరమయ్యే క్యాలరీలు లభిస్తాయి దాంతో వారు క్రమంగా బరువు పెరుగుతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com