పుదీనా రసం తాగుతున్నారా?

ఎండ ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఆ వేడిని తట్టుకోవాలంటే… ఇప్పటినుంచీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అదెలాగంటే…
* మంచినీటిని మించిన ఔషధం లేదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది మంచినీరు మాత్రమే. కాబట్టి ఇప్పటినుంచీ దాహం వేసినా వేయకపోయినా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి.
* గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే… శరీరం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే మరీ మంచిది. ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోగలుగుతారు.
* నిమ్మరసం కూడా వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
* పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్ధాలున్న పెరుగును ఈ కాలంలో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
* గసగసాలను ఎక్కువగా ఆహారపదార్థాల్లో వాడాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
* కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా… శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
* వేసవి వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జాగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో అరగంట సేపు నానబెట్టి, అందులో కాస్తంత నిమ్మరసాన్ని కలిపి తాగితే చాలు. శరీరాన్ని చల్లబరచడమే కాదు, బరువు కూడా అదుపులో ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com