పురుషార్ధాల సారాంశం అదే

ప్రపంచ దేశాల్లో భారత్ దేహము కర్మ భూమిగా ప్రఖ్యాతి గావించింది. వేద సంపదలకు నిలయమైన సత్సంప్రదాయాలకు విలువనిచ్చింది. మనిషిగా పుట్టినవాడు తన జన్మను సార్ధకం చేసుకోవాలంటే.. చేయాల్సిన విధులను వేదం చక్కగా వివరించింది. ధర్మార్ధకామ మోక్షాలు అని పిలువబడే చతువేద పురుషార్ధాలను వేదాలు సమర్ధించాయి. వీటిని ఆచరించాలి ఆచరించినవాడి జీవితమే సార్ధకము అని హెచ్చరించాయి. వాత్స్యాయన ముని తమ కామ శాస్త్ర రచన ప్రారంభిస్తూ ముందుగా ధర్మార్ధ కామాలకు నమస్కరించి రాకాహ్న ప్రారంభించాడట. ఎందుకంటే తను రచించే శాస్త్రానికి ధర్మార్ధ కామాలే ప్రధానమన విషయాలు కాబట్టి.
**ఈ ధర్మార్ధ కామ మోక్షాల గురించి తెలుసుకుందాం..
*ధర్మం:
సత్ ప్రవర్తన, మంచి నడవడిక మనవ జీవనానికి మూల సూత్రమవుతుంది. పవిత్రమైన వేదాలకు, శాస్త్రాలకు విలువనిస్తూ అందులోని విషయాలను ఆచరిస్తూ ధర్మబద్దంగా ఆచార వ్యవహారాలను పాటించడం.
*అర్ధం:
మానవుని జీవితంలో అర్ధమే పరమార్ధం అవుతుంది. అర్ధం అంటే మనవ అనుగాడకు అవసరమయ్యే ధనము, సంపదలు. దహన ధర్మబద్దంగా అర్జించడమే సరైన అర్దహం. నాటి నుండి నేటి వరకూ పరిశీలించినా.. మానవ జీవితంలో ధనర్జనకే ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. ఎందుకంటే ఇది లేందే మనిషి నిరా సక్తుడవుతున్నాడు. ధర్మ కామాలను ఆచరించే ఆర్హతలను కోల్పోయాడు. మనిషికి సంపాదన ఒక మానసిక బలం. మనిషి ముందడుగుకు ఆధారమవుతుంది. అక్రమ ధనార్జన అనర్ధకం. ధనార్జన లేని వాడికన్నా అక్రమ ధనార్జన చేసేవాడు ధర్మాన్ని తప్పేవాడు కాబట్టి మోక్షకామి కాలేదు.
*కామం:
కామము అంటే కోరిక అని చెప్పబడుతున్నది. ఆయా సందర్భాలను బట్టి మనుషులలో కోరికలు కలగటం వాటిని తీర్చుకుని ఆనందించడం జరుగుతున్నది. కాని జీవితానికి సంబందించిన అసలైన కోరిక ఆకోరిక తీర్చుకోవడం యవ్వన ప్రాయంలోనే ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రకృతి పరంగా యవ్వనంలో చలరేగే కోరికలనే కామ కోరికలు గా ప్రస్తావించడం జరుగుతుంది. కామం అనగానే యవ్వన వంతులైన స్త్రీ –పురుష లైంగిక సంభోగానికి నాంది పదముగా గోచరిస్తుంది. కామ కోరికలతో కలిసే స్త్రీ పురుషుల మధ్య సంభోగ కార్యం సృష్టిలో మధురాతి మధురమైనది. ప్రకృతిని ప్రవశింప జేసే ఏఎ కలయికలో ఆకర్షణ, ఆనందం, అనుభూతి, అనుబంధం , ఆప్యాయత, అనురాగాలకు అపూర్వ నిర్వచనం లభిస్తుంది. సృష్టి సంకల్పంతో స్త్రీ – పురుషుల మధ్య కలపబడిన ఈ కామం అపురూపమైన బంధం ఎవ్వరూ విడదీయాలేనటువంటిది. అందుకే ప్రపంచంలో ఇంకా… వివాహ వ్యవస్థ దాంపత్య జీవనం పదిలంగా ఉన్నవని చెప్పవచ్చు.
*మోక్షం:
ఇది పరలోక విషయము మోక్షము అంటే ముక్తిని పొందడం. ధర్మార్ధ కామాలలో విజయం సాధించిన తరువాత మరణించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని వేదం వివరణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com