పూజకు ప్రభాస్

వరుసగా అవకాశాల్ని అందుకొంటూ తన జోరును ప్రదర్శిస్తోంది పూజా హెగ్డే. త్వరలోనే ఎన్టీఆర్‌, మహేష్‌లతో కలిసి నటించబోతున్న ఆమె ప్రభాస్‌తోనూ జోడీ కట్టబోతోందని సమాచారం. ప్రస్తుతం ‘సాహో’లో నటిస్తున్న ప్రభాస్‌… తదుపరి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ఆ చిత్రం కోసమే పూజా హెగ్డేని కథానాయికగా ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది. ఈ యేడాది జూన్‌లోనే ప్రభాస్‌ – రాధాకృష్ణకుమార్‌ చిత్రం మొదలు కాబోతోంది. గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై కృష్ణంరాజు నిర్మించనున్నారు. త్వరలోనే విడుదల కానున్న ‘రంగస్థలం’లో పూజాహెగ్డే ఓ ప్రత్యేకగీతం చేసింది. ఆమె తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకొంటూనే, హిందీ చిత్రాలపై కూడా దృష్టిపెడుతోంది. సల్మాన్‌ఖాన్‌ ‘రేస్‌ 3’లో పూజ నటిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com