పెంచుతోంది

మగవారు కదా కండలు పెంచేది? బాలీవుడ్‌ బ్యూటీ, నాజూకు సుందరి దిశాపటానికి అంత అవసరమేమొచ్చింది? అన్న అనుమానం వస్తోంది కదూ…నిజమే! దిశాపటానీ జిమ్‌లో తెగ ఎక్సర్‌సైజులు చేసేసి కండలు పెంచేసింది. ఆ ఫోటోను ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. మామూలుగానే దిశా సన్నగా నాజూకుగా ఉంటుంది. జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేయడంతో మరింత నాజూకుతనంతో పాటు కొద్దిపాటి కండలు కూడా పెంచింది. గ్లామర్‌ రోల్‌ నుంచి యాక్షన్‌ సీన్ల వరకూ ఏ పాత్రనైనా పర్‌ఫెక్ట్‌గా చేయగలను అని చెప్పడానికే దిశా ఆ ఫోటోనుపోస్ట్‌ చేసిందంటున్నారు బాలీవుడ్‌ జనాలు. దిశా ఇలా తయారు కావడానికి టైగర్‌ష్రాఫ్‌ కారణమని కూడా అంటున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com