పెద్దాయనకు పాదాభివందనం చేసిన వీరూ

తనదైన బ్యాటింగ్‌ శైలితో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటాడు. సెహ్వాగ్‌ ఎప్పుడు ట్వీట్లు చేస్తాడా అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అతని ట్వీట్స్‌లో చమత్కారం, ఆలోచించాల్సిన విషయాలు ఉంటాయి.
ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా గడుపుతోన్న సెహ్వాగ్‌.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం జట్టు సభ్యులు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటే వారిని పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్నాడు. ఇంతలో ఓ ముసలాయన సెహ్వాగ్‌ వద్దకు వచ్చాడు. ఆయన పేరు ఓం ప్రకాశ్‌. సెహ్వాగ్‌కు వీరాభిమాని. ఓం ప్రకాశ్‌ది పాటియాలా. ఎలాగైనా తన అభిమాన ఆటగాడు సెహ్వాగ్‌ను కలవాలని అనుకున్న 93 ఏళ్ల ఓం ప్రకాశ్‌ సుమారు 70 కిలోమీటర్లు దాటుకుని వచ్చాడు. ఎట్టకేలకు సెహ్వాగ్‌ను కలుసుకున్నాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. ఓం ప్రకాశ్‌ చూపించిన అభిమానానికి ఫిదా అయిన సెహ్వాగ్‌ అతనికి పాదాభివందనం చేయకుండా ఉండలేకపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్వాహకులు ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com