పెనమలూరులో హైస్కూల్ లో తానా బ్యాక్ ప్యాక్ ల పంపిణీ.


కృష్ణాజిల్లా పెనమలూరులో జన్మించి ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రవాసులు జన్మభూమి పై మమకారంతో ఆ గ్రామంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తానా పౌండేషన్ ఆద్వర్యంలో చేపట్టిన పేద విద్యార్దుల కోసం ఏర్పాటు చేసిన బ్యాక్ ప్యాక్ ను పెనమలూరు ప్రవాసాంధ్రులు విరాళాలు అందించారు. ఆ గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు టాగూర్ మలినేని, అనిల్ పోట్లురి, ప్రశాంత్ పరుచూరి, పూర్ణ యలమంచిలి, క్రిష్ అరవపల్లి, ప్రతిమ అరవపల్లిలు 1200 డాలర్లు విరాళంగా అందించారు. ఈ విరాళంతో పెనమలూరు హైస్కూల్ లో మూడు వందల మంది పేద విద్యార్ధులకు బ్యాగులు, పుస్తకాలు అందజేశారు. అదే గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు కిలారు సత్య జన్మభూమి పధకం ద్వారా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ తరగతి గదికి విరాళాన్ని అందించారు. డిజిటల్ తరగతి గదిని కూడా ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తానా అద్యక్షుడు వేమన సతీష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తానా ఆద్వర్యంలో అమెరికాలో ఉన్న పేద విద్యార్ధులకు బ్యాగులు, పుస్తకాలను అందించేవారమని ఈ ఏడాది నుండి అక్కడ ఉన్న ప్రవాసుల సహకారంతో ఆంధ్రా రాష్ట్రంలో పదివేలమంది పేద విద్యార్ధులకు బ్యాగులు, పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. వచ్చే డిసెంబరు నెలలో తానా ఆద్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రామాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ లు విద్యార్ధులకు బ్యాగులు ఇతర సామాగ్రీ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తానా బ్యాక్ ప్యాక్ కమిటీ ఛైర్మన్ ఉప్పుటూరి రామ్ చౌదరి, సమన్వయకర్త రాజా కసుకుర్తి సమన్వయంతో నిర్వహించారు.





More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com