పెరిగిన దూకుడు

మహేష్ బాబు సినిమా కోసం ఒకప్పుడు అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన రూటు మార్చారు. వేగం పెంచేశారు. ఆ వేగం చూస్తే ఎవరికైనా కళ్ళు చెదరిపోవాల్సిందే. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే కొత్తగా మూడు పచ్చజెండా ఉపేశాడు. మహేష్ దూకుడు అదే స్తాయిలో కొనసాగితే ఇక అభీమానులకి పండగే అని చెప్పొచ్చు. మహేశ్ కొత్త సినిమాల గురించి ఇక తీరిక లేకుండా మాట్లాడుకోవచ్చన్నమాట. కదల ఉదృతి పెరగడంతోనే మహేష్ వెంట వెంటనే కొత్త సినిమాలకి ఓకే చెప్పేస్తున్నారు. మహేష్ దృష్టి ఎప్పుడు కధల మీదే ఉంటుంది. మంచి కదా అనుకుంటే ఆయన అస్సలు వదిలి పెట్టరు. ఇదివరకు కూడా ఆయన కదల వల్లే ఆచితూచి అడుగులేశారు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరకి అన్నీ మంచి కధలే వస్తున్నాయట. కధలున్నప్పుడు సినిమా చేయడానికి సమస్యేముంటుoది? అందుకే వేగంగా సినిమాలు ఒప్పుకోoటున్నా అంటారు మహేష్. అందుకే ప్రస్తుతం మురుగదాస్ దర్సకత్వంలో నటిస్తూనే కొరటాల శివ, వంశి పైడిపల్లి, త్రివిక్రమ్ చెప్పిన కధలకి ఓకే చెప్పేశారు. విక్రం కె. కుమార్ చెప్పిన ఓ కదా కూడా మహేష్ కి నచ్చిందట. ఇవన్ని పూర్తయ్యాక ఆయనతోను సినిమా ప్రకటించే అవకాశాలున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com