పెరుగుతో పలు ఉపయోగాలు

మన ఇళ్లలో నిత్యం అందుబాటులో ఉండే పెరుగుతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా చర్మాన్ని పలు సమస్యల నుంచి కాపాడేందుకు ఇది మంచి రెమిడీ. పెరుగుతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.చర్మాన్ని, జుట్టును తేమగా ఉంచేందుకు పెరుగును ముఖానికి రాసుకోవడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు.ముఖంపై ముడుతలను తగ్గించడంలో పెరుగు బాగా సహాయపడుతుంది.ముఖంపై మొటిమలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అతి సాధారణమైన పద్ధతిలో పెరుగును ఉపయోగించి మొటిమలను వదిలించుకోవచ్చు.పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి రాయడం వల్ల మొటిమల తాలూకు గుర్తులు తొలిగిపోతాయి.చర్మకణాలను పెంచడంలో పెరుగు బాగా ఉపయోగపడుతుంది. సన్ బర్న్‌తో చర్మం ఎర్రగా, వేడి బొబ్బలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య నుంచి పెరుగు చర్మాన్ని కాపాడుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com