పెళ్లి పత్రిక పంపిస్తే స్వామివారి తలంబ్రాలు ఇస్తారు

తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమం చేపట్టింది. *కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది.* ఈమేరకు టీటీడీ పీఆర్‌వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే *శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.* పెళ్లి పత్రికను ఎగ్జిక్యూటివ్ అధికారి, టీటీడీ, కేటీ రోడ్, తిరుపతి-517 501కు పంపించాలని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com