పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇల్లు కట్టి చూడు .. పెళ్లి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో.. పెళ్లి చేయడమూ అంతే కష్టం. అమ్మాయి అయినా..అబ్బాయి అయినా సరైన ఈడుజోడు కోసం వెతికి వెతికి వేసారిపోతుంటారు. చాలా మంది. తెలిసిన బంధువులు, స్నేహితులకు చెప్పినా ఒక్కోసారి ఫలితంగా ఉండదు. దీంతో మ్యాట్రీ మొనీ సైట్లను ఆశ్రయిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైంది. గతంలోలాగా మధ్యవర్తులుగా ఉండే పెద్ద మనుషులు ఇప్పుడు కనిపించడం లేదు. సంబద్నహాలు తెచ్చేవాళ్ళు కరువయ్యారు. దీంతో ఎక్కడో ఉన్న అబ్బాయిని మరెక్కడో ఉన్న అమ్మాయిని కలిపే బాదయ్తను మ్యాట్రీ మొనీ సైట్లు తమ భుజాన వేసుకుంటున్నాయి. దీనివల్ల సంబంధాల వెతుకులాట కాస్త సులువైంది. కాస్త డబ్బులు కడితే చాలు హాయిగా ఇంట్లో కూర్చొనే మంచిమంచి సంబందాలు చూడోచ్చని ఏ మ్యాట్రీమొనీ సైట్ కనిపిస్తే అందులో తమ వివరాలు ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా మ్యాట్రీమొనీ సైట్ల పేరుతొ జరుగుతున్న మోసాలతో జాగ్రత్తగా ఉండాలనీ సూచిస్తున్నారు. కొత్తకొత్త పద్దతుల్లో సైబర్ క్రైంకు పాల్పడుతూ డబ్బు సంపాదించాలనీ చూస్తున్న మోసగాళ్ళు..ఇప్పుడు మ్యాట్రీ మొనీ సైట్ల పై పడ్డారు. చాలా మంది ఈజీగా బుట్టలో పడుతుండటంతో వాళ్ళ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందని పోలీసులు అంటున్నారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా మధ్య వయసు మహిళలు, విడాకులు తీసుకున్నవాళ్లు, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సైబర్ క్రైం డిప్యుటీ కమిషనర్ కేసిఎస్ రఘువీర్ చెప్పారు. ప్రధానంగా వీళ్ళు మూడు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. మొదటగా కొందరు వ్యక్తులు కలిసి ఓ చిన్న గదిలో మ్యారేజ్ బ్యూరో ను ఏర్పాటు చేయడం.. పేపర్లలో యాడ్స్ ఇవ్వడం చేస్తారు. ఇది చూసి తమ దగ్గరికి వచ్చే వాళ్ళ నుంచి ముందే ఖర్చుల కోసమంటూ డబ్బులు వసూలు చేస్తారు. తర్వాత కచ్చితంగా వద్దు అనుకునే సంబద్నాలను చూపిస్తారు. ఊహించినట్లుగానే వాళ్ళు వద్దని చెబుతారు. మా పని మే చేశాం.. మీరే వద్దన్నారంటూ ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వడానికి నిరాకరిస్తారు.
*ఇక రెండో పద్దతోలో భాగంగా.. సోషల్ మీడియా సైట్లలో నకిలీ పేర్లతో అకౌంట్లు సృస్టిస్తారు. మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. తాము విదేశాల్లో ఉన్నట్లు వాళ్ళను నమ్మిస్తారు. మెల్లగా పరిచయం పెంచుకుని వాళ్ళు తమను గుడ్డిగా నమ్మేవరకు తీసుకెళతారు. ఆ తర్వాత విదేశాల నుంచీ ఖరీదైన బహుమతులు పంపిస్తునట్లు చెబుతారు. కొన్ని రోజుల తర్వాత ఎయిర్ పోర్ట్ అధికారులమని చెబుతూ కొందరు ఫోన్ చేస్తారు. మీకు విదేశాల నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. అయితే అవి కస్టమ్స్ లో ఇరుక్కుపోయాయి. వాటిని విడిపించుకోవాలి అంటే కొంత మొత్తం డిపాజిట్ గా చెల్లించాలని చెబుతారు. వాళ్ళ మాటలు నమ్మి డబ్బు డిపాజిట్ చేశారనుకోండి.. ఇక అంతే సంగతులు డబ్బు చేతికందగానే ఆ నకిలీ అకౌంట్లన్ని మాయమైపోతాయి.
*ఇక మూడో పద్దతి దోపిడిలో మ్యాట్రీమొనీ సైట్లలో తమను తాము ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసుకుంటారు. బాధితులను ఆ సైట్లలో వెతుకుతారు. వాళ్ళను పూర్తిగా నమ్మిస్తారు. పెళ్లి చేసుకుంటామని మాట కూడా ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత యాక్సిడెంట్ అయిందని, కాస్త డబ్బు డిపాజిట్ చేయాలనీ అడుగుతారు. ఇక్కడా అంతే డబ్బు ముట్టగానే మళ్ళీ అడ్రస్ లేకుండా మాయమైపోతారు. ఇలాంటి వాళ్ళను నమ్మొద్దని ఎన్న్సార్లు చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదు. దీని వల్ల ఈ సైబర్ క్రైంను అరికట్టడం తమకు పెద్ద సవాల్ గా మారుతుందని డిప్యుటీ కమిషనర్ రఘువీర్ చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com