పేదలు కానరాని మారాజుల విరాళాలు 5కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలనూ భాగస్వాములను చేసేందుకు ప్రారంభించిన ‘నా ఇటుక- నా అమరావతి’ వెబ్సైట్ ద్వారా జమ అయిన విరాళాల మొత్తం మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి 5 కోట్లను దాటింది. దీనిని ఈనెల 15న ప్రారంభించారు. ఇప్పటి వరకూ మొత్తం 2,18,670 మంది దాతలు రూ.5,00,58,300లను రాష్ట్ర రాజధాని కోసం తమ వంతుగా ఇచ్చారు. సోమ, మంగళవారాల్లో పెద్ద సంఖ్యలో అమరావతి ఇటుకలను కొనుగోలు చేసిన వారిలో కోనేరు ఝాన్సీలక్ష్మీబాయి (3,500 ఇటుకలు), మేకా నాగమల్లేశ్వరరావు (2,842), గీతం ఇనస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (2,435), ఎం.డి.సిరాజుద్దీన(1,000ఇటుకలు) ఉన్నారు. ఇదే స్ఫూర్తి ఇకముందూ ఇదే విధంగా వడివడిగా కొనసాగి, భవ్య అమరావతి నిర్మాణంలో మరింతమంది పాలుపంచుకునేలా చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీయే వర్గాలు ఆశిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com