పేద చిన్నారుల ఆహార తయారీకి నాట్స్-సీటీఏ సాయం


ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది పేద పిల్లల కోసం అరోరాలోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ(FMSC) తయారుచేసిన ఆహార పదార్థాలను భద్రపరిచేందుకు చికాగో తెలుగు అసోసియేషన్, నాట్స్ వాలంటీర్లు సాయం అందించారు. 60వేలకు పైగా ఆహార పొట్లాలను ఈ సందర్భంగా భద్రపరిచారు. నాట్స్ డైరెక్టర్స్ రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగె, సీటీఏ, నాట్స్‌ సభ్యులు శ్రీనివాస్ చుండూ, ప్రసాద్ తాళ్లూరు, రాంగోపాల్ దేవరపల్లి, శైలేంద్ర సుంకర, వంశీ మన్నె, ఉమా దేవరపల్లి, మాధవి తిప్పిశెట్టి, రాణి వేగె, మాధవి ఆచంట, అజయ్ రెడ్డి, శ్రీనివాస్ తలశిల, శేషు ఉప్పలపాటి, కౌసల్య గుత్తా, రాజశేఖర్ కందుల, నందు, రవి రామముని, శ్రీనివాస్ ఆచంట, నాగభూషణం భీంశెట్టి, వెంకట్ తొక్కల, అనిల్ మోపర్తి, రమేష్ కొలుకులూరి, రమేష్ తిప్పిశెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ అనేది ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ అని ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొనడం ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు పేర్కొన్నారు.
tnilive.com tni telugu news international nats north america telugu society charity chicago telugu association 2017 nris helping starving poor kids

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com