పేర్వారం రాములి మనవడు దుర్మరణం

మాజీ డీజీపీ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేర్వారం రాములు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పేర్వారం రాములు మనవడు వరుణ్‌, ఆయన అల్లుడి సోదరుని కొడుకు అమిత్‌ మృతదేహాలను పంజాగుట్టలోని పేర్వారం నివాసానికి పోలీసులు తరలించారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందిన సంగతి తెలిసిందే. మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు వరుణ్‌ పవార్‌(23) మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి కోకాపేటలోని తమ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఉదయం కారులో తిరిగి వస్తుండగా అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వరుణ్‌, అతని బాబాయ్‌ కుమారుడు అమిత్‌(23) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించి పంజాగుట్టలోని పేర్వారం నివాసానికి తీసుకువచ్చారు.తెలంగాణ రాష్ట్ర ఐజీ భగవత్‌, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఐపీఎస్‌ అధికారి అప్పారావు, సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు పేర్వారంను పరామర్శించారు. వరుణ్‌ స్వస్థలం నిజామాబాద్‌ పట్టణం. పదేళ్ల క్రితమే అతని తల్లి మరణించింది. అప్పటి నుంచి వరుణ్‌ పేర్వారం రాములు వద్దే ఉంటున్నాడు. మృతదేహాలను చూసిన పేర్వారం రాములు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com