పొట్లూరి రవి ఇచ్చిన ఈ-సైకిళ్ళను పంపిణి చేసిన లోకేష్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కోశాధికారి పొట్లూరి రవి విరాళంతో కర్నూలు మహిళా పోలీసుల కోసం అందించిన పది ఈ-సైకిళ్ళను పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సోమవారం నాడు ప్రారంభించారు. మహిళా పోలీసులు తమ విధులు నిర్వహించడానికి వీలుగా ఉండే నిమిత్తం ఈ ఎలక్ట్రానిక్ సైకిళ్ళను అందించారు. ప్రవాసంలో ఉంటూ కర్నూలు జిల్లాలో పలు సేవా కార్యక్రామాల్లో చురుగ్గా పాల్గొంటున్న తానా కోశాధికారి పొట్లూరి రవి సేవలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కొనియాడారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామాల్లో, జిల్లాలో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ. బుట్టా రేణుక, శాసనసభ్యుడు ఎస్.వీ. మోహన్ రెడ్డి, జిల్లా ఎస్పి గోపినాద్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com