పోలాండ్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

టి.ఆర్.యస్ పోలాండ్ శాఖ ఆధ్వర్యంలో వార్సా నగరం లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య నాయకుడు మహేష్ కుమార్ ఊరుగొండ ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో, కెసిఆర్ గారి 64 వ పుట్టినరోజు కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి, జై కెసిఆర్ ….కెసిఆర్ గారి నాయకత్వం వర్ధిలాల్లని నినదించారు . కెసిఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, బంగారు తెలంగాణ నిర్మాణం కెసిఆర్ గారి వల్లే సాధ్యమవుతుందని, భగవంతుడు వారికి ఆశీస్సులు అందించాలని కోరారు. మహేష్ కుమార్ మీడియా సందేశం లో గతం లో లండన్ లోని తెరాస శాఖలో పని చేస్తున్నప్పుడు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నానని, మళ్ళి ఇలా పోలాండ్ లోని తెరాస శాఖ ఆద్వర్యం లో కెసిఆర్ గారి వేడుకలు నిర్వహించడం చాలా గర్వాంగా ఉందని, ఈ అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల ప్రతక్షంగా పోలాండ్ వచ్చి మరీ తెరాస శాఖను ఏర్పాటు చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన ఎన్నారై తెరాస కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు సలహాలు సూచనలిస్తున్న ఎన్నారై తెరాస యుకె అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం గారికి మరియు శ్యామ్ బాబు గారికి కూడా కృతఙతలు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య నాయకుడు మహేష్ కుమార్ ఊరుగొండ, సభ్యులు జగన్, కార్తీక్, మనీష్, ఫణి, సునీత్, అజయ్, సందీప్, మోను,సూర్య, లిఖిత్, శ్రీనాథ్, హరీష్, నవీన్, గోకుల్, బుజ్జి బాబు, గోవర్ధన్, బలరాం తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com