ప్రజలు తోడ్పడితేనే విశ్వనగరం అవుతుంది

భాగ్యనగర ప్రజలకు సంతృప్తికర స్థితిలో తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నీటి సరఫరా కోసం పాత పైపులైన్లను తీసేసి కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని నిజాంపేట్‌లో జీహెచ్ఎంసీ నిర్వహించిన ఖి మన నగరంఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి…. నగరంలో చేపట్టే అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ హైదరాబాద్ ప్రథమ స్థానం దక్కించుకుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మురుగు నీరు, వరద నీరు కాలువలను పునరుద్ధరిస్తామని తెలిపారు. నగరంలోని 54 నాలాలకు వికేంద్రీకరణ పద్ధతిలో ఒక్కొక్క నాలాకు ఒక్కో మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూసీ నది సుందరీకరణ కోసం రూ.1600 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని, నగరంలో ప్రత్యేకంగా ఆటోల ద్వారా రోజుకు 4800 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నామని తెలిపారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని, మూడో దశ మెట్రోను అక్టోబర్‌లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. నగరంలోని 3800 ఆర్టీసీ బస్సుల స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. నగరం మధ్యలోని పరిశ్రమలను ఆరేడేళ్లలో ఫార్మాసిటీకి తరలిస్తామని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యముంటేనే నగరాన్ని అభివృద్ధి చేయగలమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరం కావాలంటే అన్ని మౌలిక వసతులు కావాలన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com