ప్రజలే బుద్ధి చెప్తారు

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా నేతలు.. ఎన్టీఆర్‌ విగ్రహాలను పెట్రోల్‌ పోసి తగులబెడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వారి దుర్మార్గపు చర్యలను ప్రజలు చూస్తూ వూరుకోరని.. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్లలో రూ.1.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. వైకాపా అధినేత జగన్‌ విధ్వంసక ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజాయతీగా.. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com