ప్రతిదానికి ఆధార్ అక్కర్లేదు-కేంద్రం

ఆధార్‌ కార్డును ప్రతి ఒక్క అవసరానికి తప్పనిసరి చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆధార్‌ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్‌ సిమ్‌ పొందడానికి ఆధార్‌ కార్డు అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ విషయంపై కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లు డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ కార్డు వంటి డాక్యుమెంట్లతో సిమ్‌ కార్డును ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్‌ సుందరరాజన్‌ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com