ప్రతిరాత్రి శృంగారం చాలా అవసరం

భార్యాభర్తల మధ్య శృంగారం తరచూ అవసరమా… అంటే అవుననే చెబుతున్నారు ప్రముఖ నిపుణులైన మైఖేల్‌ వెయ్‌నెర్‌ డేవిస్‌. దీనివల్ల భార్యాభర్తలు ఆనందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగానూ ఉంటారట. వాళ్లమధ్య గాఢమైన బంధం అల్లుకుంటుంది. బాధ్యత పెరుగుతుంది. ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడికీ అలసటకీ క్రేవింగ్‌కీ కారణమయ్యే కార్టిసాల్‌లాంటి హార్మోన్ల స్రావం తగ్గి, ప్రశాంతంగా ఉంటారు. డిప్రెషన్‌, ఆందోళన దరిచేరవు. శృంగారంవల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఆనందంగా ఉండేలా చేస్తాయి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. హృద్రోగాలనీ ఇన్ఫెక్షన్లనీ బీపీనీ జీర్ణాశయసమస్యల్నీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నీ నిరోధిస్తుంది. మంచి నిద్రపట్టేలానూ చేస్తుందనీ మూత్రాశయ సమస్యల్నీ నిరోధిస్తుందని నొక్కి చెబుతున్నారు నిపుణులు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com