ప్రతి కళ్ళజోడు పోలరైజ్డ్ కాదు

ఎండా కాలం రానే వచ్చింది. వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు సూర్యుని నుంచే వెలువడే అల్ట్రావయలెట్ కిరణాలు నేరుగా కళ్ల మీద పడితే రెటినా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వల్ల చూపు మందగిస్తుంది. అందువల్ల చాలా మంది ఎండా కాలం రాగానే చలువ కళ్లద్దాలు వాడుతూ ఉంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతి వేసవిలో 80 వేల నుంచి 1.10లక్షల మంది నూతన కళ్లద్దాలు కొనుగోలు చేస్తారని ఒక అంచనా. అయితే వేటిని పడితే వాటిని సమ్మర్‌ గ్లాసులుగా వాడరాదని సీనియర్‌ నేత్ర వైద్యులు డాక్టర్‌ బళ్ల నాగేశ్వరరావు వివరించారు. ఎస్పీ వన్‌ (పింక్‌ కలర్‌లో ఉంటాయి), ఏవన్‌(బ్లూ కలర్‌లో ఉంటాయి) ఫొటో గ్రే( సాధారణంగా తెల్లగానూ, ఎండ తగిలితే గ్రే రంగులోకి మారతాయి) రకాలు మంచివని, వీటిల్లో ఎవరికి ఏవి సరిపడితే అవి వాడాలని, నేత్ర వైద్యులను సంప్రదించి తీసుకోవాలని వివరిస్తున్నారు. రోడ్ల వెంట తక్కువ ధరకు లభించేవి రీ-సైకిల్‌ మెటీరియల్‌తో తయారైన వాటిని వాడితే కళ్లల్లో శుక్లాలు వస్తాయని ఆఫ్రోమెట్రిస్ట్‌ శ్రీధర్‌ చెబుతున్నారు. ఫైబర్‌ అద్దాలు వస్తూన్నా వాటి కంటె గాజువే మంచివని ఆయన వివరించారు. మొత్తం మీద ప్రతి రంగు అద్దం చలువ చేయదని గ్రహించాలి. నాణ్యమైనవి వాడకుంటే అసలుకే మోసం వస్తుంది కాబట్టి మంచివి ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో రూ.500 మొదలుకొని రూ.800లోపు మంచి వేసవి కళ్లద్దాలు లభిస్తున్నాయి. వాటిల్లో మనకు నచ్చింది, మనకు నప్పేది ఎంచుకుని వాడుకుందాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com