ప్రత్యేకానికి వారం రోజుల్లో సమాధానం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా? లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా? అన్న సందిగ్ధతకు వారం రోజుల్లో తెరపడనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు.. భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో ఈరోజు మరోసారి భేటీ అయి ఈ అంశంపై చర్చించారు. అంతకుముందుకు ఉదయం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు ప్రధాని మోదీని కలిసి దీనిపై చర్చించారు. పార్టీ పరంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వెంకయ్యనాయుడు వారికి సూచించినట్లు తెలుస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com