ప్రపంచంలోనే భారీ కృష్ణాలయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్య క్షేత్రం బృందావనం. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కృష్ణ భగవానుని ఆలయం నిర్మాణం కానున్నది. దాదాపు 300కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆలయాన్ని వచ్చే ఐదేళ్ళలో రూపుదిద్దనున్నారు. బృందావన్ చంద్రోదయ మందిరం పేరిట దీన్ని 700అడుగుల ఎత్తున నిర్మించనున్నారు. బెంగుళూరులోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్) ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టనున్నది. ఈ ఆలయ నిర్మాణానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబర్ 16న అనంత శేష స్థాపన పూజను నిర్వహించారు. ఈ ఆలయం వల్ల బృందావనం అత్యంత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రణబ్ ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు. 70 అంతస్తులతో ఉండే ఆలయంలో సందర్శకులు నేల మీది నుంచి అగ్రభాగానికి చేరుకోవడానికి అతి పెద్ద లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. 26ఎకరాల విస్తీర్ణంలో పన్నెండు వనాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ పన్నెండు వనాలతో పాటు కృష్ణలీల ధీమ్ పార్కును కూడా ప్రత్యేక ఆకర్షణగా రూపొందించాలని నిర్ణయించారు.
15saqrt

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com