ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహాసభల సన్నాహక సమావేశాలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న 5రోజుల ప్రపంచ తెలుగు మహాసభలు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి 5రోజుల ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15 వ తేదీ నుండి 19 తేదీ వరకు హైదరాబాద్ లో నిర్వహించుటకై రంగం సిద్దమయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు తెలంగాణా రాష్ట్ర సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఆ సంస్ద చైర్మన్ నందిని సిద్దరెడ్డి, మిగితా కోర్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయడానికై కోర్ కమిటీ సభ్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ప్రపంచ తెలుగు మహాసభల పనులు వేగవంతం చేయడానికై గత వారం ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఎన్నారై కోర్డినేటర్ మహేష్ బీగల యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా, ఆస్ట్రియా లో పర్యటించి అక్కడ సన్నాహక సదస్సుల ఏర్పాటు చేసి ప్రపంచ తెలుగు మహాసభలకు ఆ దేశంలో నివాసముంటున్న తెలుగు ప్రజలను ఆహ్వానిస్తున్నారు.

సన్నాహక సదస్సుల వివరాలు –

నవంబర్ 14 – లండన్(యూకే)
నవంబర్ 15 – అట్లాంటా (ఉస)
నవంబర్ 17 – టొరొంటో (క్యానడ)
నవంబర్ 18 – సన్ ఫ్ర్యాన్‌సిస్‌కొ/డల్లాస్ (ఉస)
నవంబర్ 19 – న్యూజర్సీ (ఉస)
నవంబర్ 23 – వియెన్న (ఆస్ట్రీయ)

ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యులు దేశపతి శ్రీనివాస్ ఆస్ట్రేలియలో సన్నాహక సదస్సలు నిర్వహిస్తున్నారు.

వివరాలు –
నవంబర్ 25 – మెల్బర్న్ (ఆస్ట్రేలియ)
నవంబర్ 26 – సిడ్నీ (ఆస్ట్రేలియ)

ఎమ్మెల్యే, కల్చరల్ డిపార్ట్మెంట్ చైర్మన్ రసమయి బాలకిషన్ దుబాయ్, సౌతాఫ్రికా లో నవంబర్ 17 , 20 తేదీలలో సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎస్ వి సత్యనారాయణ తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సింగపూర్, మలేసియాలో నవంబర్ 24 , 26 తేదీల లో సన్నాహక సదస్సులను నిర్వహిస్తున్నారు. అలాగే న్యూజీలాండ్ లో నవంబర్ 19 ,డెన్మార్క్ లో నవంబర్ 26 తేదీ నాడు సన్నాహక సభలను నిర్వహించడం జరుగుతుంది. 5రోజుల ప్రపంచ తెలుగు మహాసభలకు ఎల్ బి స్టేడియం ముఖ్యవేదిక కాగా రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్, లలిత కళాతోరణం, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, భారతీయ విద్య భవన్ , శిల్ప కల వేదిక, పింగిళి వెంకట్రామ్ రెడీ హాల్ ఇతర కార్యక్రమాలకు వేదికలు కానున్నాయి. లిట్రేచర్ కి సంబందిచిన కార్యక్రమాలు ప్రొద్దున, మధ్యాహ్నం కాగా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం సమయంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోలాటం, గిరిజనుల సాంస్కృతిక నృత్యాలు, పేరిణి నృత్యం, పాటలు, బతుకమ్మ, రామదాసు పద కీర్తనలు, తందానా రామాయణం, సరదాకర్స్, హరికథ, కవి సమ్మేళనం, కవిత సంపుటాల అవధానం, పద్యాలు, జానపద గేయాలు, ఇంకా ఇతర సాహిత్య, సాంస్కృతిక కళల ప్రదర్శనకై ప్రపంచం తెలుగు మహాసభలు సిద్ధం అవుతున్నాయి.

ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప-రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని ఆహ్వానించడం జరిగింది. అలాగే సాహిత్య అవార్డు జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న తెలుగు, ఇతర భాషల కవులను కళాకారులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎన్నారై లు అందరు ప్రపంచ తెలుగు మహాసభలల్లో పాలుగొని తెలుగు భాషా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దరెడ్డి, ఎన్నారై ఇంచార్జి మహేష్ బిగాలఇతర కోర్ కమిటీ సభ్యులు కోరారు. మరిన్ని వివరాలకు www.wtc.telangana.gov.in Email: nri-wtc@telangana.gov.in ledaa nriwtc2017@gmail.com సంప్రదించగలరు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com