ఎన్నారై సమన్వయకర్తగా మహేష్ బిగాల-ప్రభుత్వ జీవో


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు చేపట్టబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవాసుల సమన్వయకర్తగా మహేష్ బిగాలని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు ప్రపంచం నలుమూలల నుండి భాషాప్రియులను ఆహ్వానించడానికి ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ తీర్మానం మేరకు ఆయనకు ఈ హోదా కల్పించారు. తన మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ తదితరులకు మహేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు లండన్ (యూకే), అట్లాంటా(అమెరికా), టొరంటో (అమెరికా), శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా), ఆక్లాండ్ (అమెరికా), న్యూజెర్సీ (అమెరికా), డల్లాస్ (అమెరికా), వియన్నా (ఆస్ట్రియా), కోపెన్హాగన్ (డెన్మార్క్)లలో సన్నాహక సదస్సులు నిర్వహించామని, ప్రవాసులు ప్రపంచ తెలుగు మహాసభల్లో విరివిగా పాల్గొని జయప్రదం చేయవల్సిందిగా కోరారు.
tnilive.com tnilive 2017 world telugu conference mahesh bigala

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com