ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముక్త్యాల రాజుల బంధువు-మీనాక్షి


కోయంబత్తూరులో నివాసం ఉంటున్న మన తెలుగు మహిళ మీనాక్షి అరవింద్ తన ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి 2017వ సంవత్సరంలో ముంబాయి నుండి కారులో ప్రయాణం ప్రారంభించి డెబ్బై రోజుల్లో 24దేశాలు సందర్శంచి 28వేల కి.మీ.లు చుట్టి వచ్చారు. ఈ సాహస యాత్ర చేసిన మీనాక్షి అరవింద్ కు సంబందించిన విశేషాలు ఇవే.
**ముక్త్యాల రాజావారి కుమార్తె వెలగపూడి కేసీపీ దత్తు సతీమణి అయిన ఇందిరా దత్తు చెల్లు రామాది కోయంబత్తూరు. ఆమె భర్తకు మేనకోడలే మీనాక్షి. కోయంబత్తూరుకి చెందిన పారిశ్రామికవేత్త కాంకలల్లారే సుబ్బయ్య కోకిల మూడవ సంతానం ఈమే. ఈవిడకు ఇద్దరు అన్నలు, భర్త ఏటికూరారే అరవింద్. దిండిగల్ లో స్పిన్నింగ్ మిల్ నడుపుతున్నారు. అదే ఊరిలో మీనాక్షి లేక్ సైడ్ రీస్టార్ట్ నడుపుతూ మెటోసీమ ఈవెంట్స్ అండ్ యాక్సె పిరియాన్సేస్లో భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఒక్కతే పాప. 21 సంవత్సరాలు. అమెరికాలోని న్యూయార్క్లో లిబరల్ ఆర్ట్స్ చదువుతోంది.
* ముగ్గురే ఆడవారు ఇంతటి సాహస యాత్రకు పూనుకోవటం. అసలు ఎందుకు అలాంటి సాహసం చేయాలనిపించింది అనగానే.. నాకు ఏదైనా చెయ్యాలనిపిస్తే అది చేసి సాధిస్తాను. అదే అందరికి చెబుతాను. పుస్తకం రాయాలనుకుంటున్నారా వెంటనే రాయటం మొదలు పెట్టండి. సినిమా తీయాలని ఉందా మీ ఆలోచనని ఆచరణలో పెట్టండి. ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీలేదు. నాకు స్వతాహాగా కొన్ని హాబీలు ఉన్నాయి. నాకు భారతదేశం అంటే విపరీతమైన ప్రేమ, జంతువులంటే ఇష్టం, పుస్తక పటనం, ఆర్గానిక్ ఫార్మింగ్, సంగీతం, ఇంటి అలంకరణలతో పాటు వివిధ ప్రదేశాలు చుట్టిరావడం లాంటివి నా అభిరుచులు. అందుకేనేమో నా భుజం పైన ప్రపంచ పటాన్ని పచ్చబోట్టుగా వేయించుకుంటున్నానంటూ చెప్పుకోచ్చారమే. మనదేశంలో తయారైన టాటా కారులో మన 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మనదేశంలోని ఆడవాళ్ళూ ఈ స్వాతంత్ర్య వచ్చిన 70 సంవత్సరాల్లో ఎంత ముందుకు వెళ్ళారో నా ఈ పర్యటన ద్వారా తెలియపరచటం కోసం ఇండియా టూ ఇంగ్లాండ్ కారు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. మనదేశంలో నిరక్ష రాస్యత, శానిటేషన్. ఆడవాళ్ళకు తెలవాల్సిన అనేక సామాజిక, శారీరక విషయాల పై అవగాహనా ఈ ట్రిప్ ద్వారా తెలియ చేయాలనుకుంటున్నాను. అందుకే 2017 మర్చి 26న కోయంబత్తూరు నుంచి నేను, నాతొ పాటు మూకాంబిక రత్నం (పొల్లాచి, తమిళనాడు నుంచి), ప్రియా రహీబ్ (ముంబాయి నుంచి), ముగ్గురం ‘ఎక్స్ పీడీ 2470’పేరుతొ 28,600కిమీ. 24దేశాలు 70రోజుల్లో అంటే జూన్ 5కి ముగించుకోచ్చాం.
*మేము అలా వెళ్ళటానికి ఆరునెలలు ముందునుంచే రూటు నుంచి వీసాల వరకు అన్ని ప్లాన్ చేసుకున్నాం. వీసా కాగితాలు రాయటానికే మా సమయమంతా సరిపోయిందంటూ గట్టిగా నవ్వారామే. టాటా మోటార్స్ వారి పూణే బ్రాంచ్ కి వెళ్లి కారు మెకానిక్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాము. కొత్త ప్రదేశాలలోని వాతావరణం, అక్కడి రోడ్ సెన్స్ , వారి భాష, ఒకరం మార్చి మరొకరం కారు తోలుతూ అంత ఆషామాషిగా కాలేదు. ఎడారుల నుంచి మంచు ప్రాంతాలకు ఇలా మారిన వాతావరణం. విచిత్రం ఏమిటంటే ఒకే కారులో ప్రయాణించిన మేము ముగ్గురం స్నేహితులం కాము. ఈ ప్రయాణం కోసం కలిశాము. ఒక సీస నీళ్ళు కొనాలన్నా ముగ్గురికి మూడు అభిప్రాయాలు. ఒకరికి మ్యూజిక్ వినాలని ఉంటె, మరొకరికి సేద తీరాలని ఉంటుంది. అలా అన్ని, బ్యాలెన్స్ చేసుకుంటూ 70రోజులు ముగించాము.
*మాకు ఉజ్బెకిస్తాన్ లో పాటలుపాడే ఒక హవాస్ గురుహ్ కుటుంబం ఎదురయింది. వారు అక్కడి స్థానికులు కానీ, వారు పాడేది మన భారతీయ సినీగీతాలు. వారిని మన దేశానికి ఆహ్వానించి 2018 జనవరి 6వ తేదీన ఒక చారిటబుల్ ఈవెంట్ జరిపించాము అని ముగించారమే.
*ఇంకా ఎన్నో యాత్రలు చేయాలనుకుంటున్నాను. కలలు కనటం వేరు. ఆ కలలను సాకారం చేసుకునే స్వేచ్చ అవసరం. మాతృభూమి మీద ఎనలేని మమకారం భారతీయ మహిళలకు తనవంతూ ఏదైనా చేయాలన్న తపన ఆమెకు ఎన్నో అవార్డులను, గుర్తింపులను తీసుకువస్తున్నాయి. మీనాక్షి గారూ, మీలాంటి వారు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ముఖ్యంగా మన సమాజంలోకి ప్రతి ఆడవారు తమవంతుగా సమాజానికి ఏదైనా చేయగలిగితే మీరు చెప్పినట్టుగానే మన భారతదేశంలో ప్రతి ఆడవారు చదవడం, ఆడపిల్లాల పైన చులకన భావం పోవటం, ఉమెన్ ఎంపవర్ మెంట్ లాంటివి సాధించటం సాధ్యపడుతుంది. మీ ధైర్యానికి, మీ మంచితనానికి, మీ ఆదర్శానికి సలాము చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జైహింద్.
**రోజుకి ఎనిమిది గంటలు చొప్పున కారు తోలుతూ వారు చుట్టి వచ్చిన ప్రదేశాలు
మయన్మార్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్తాన్, కజికిస్థాన్, రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా, బల్గేరియా, మేసిడోనియా, సేల్బియా, క్రోషియా, ఆస్ట్రియ, బెజేరిపబ్లిక్, స్విట్జర్లాండ్, జర్మని, ప్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లండన్ దేశాలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com