ప్రభుత్వ రంగ చెల్లింపుల యాప్ ద్వారా రాయితీలు

డిజిటల్ లావాదేవీలను ఈజీ చేయడానికి ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్ ను ప్రధాని నరేంద్రమోడీ 2016వ సంవత్సరంలో ఆవిష్కరించారు. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్‌ చేసిన ప్రభుత్వ యాప్‌ ‘భీమ్‌’. ఇప్పుడు భీమ్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. దీంతో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14నుంచి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అమలు చేయనుంది. భీమ్‌ యాప్‌ ద్వారా మెదటి సారి రూ.100 లావాదేవీ జరిపినప్పుడు రూ.51 క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. ఇలా వినియోగదారులకు గరిష్టందగా రూ.750 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com