ప్రమాణస్వీకారం చేసిన చీఫ్ జస్టిస్ ఖేహర్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జగదీష్‌ సింగ్‌ ఖెహర్‌ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జేఎస్‌ ఖెహర్‌ 1952లో పంజాబ్‌లో జన్మించారు. చండీగఢ్‌ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పంజాబ్‌ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌.బీ, ఎల్‌ఎల్‌.ఎమ్‌ పూర్తి చేశారు. 1999లో పంజాబ్‌, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009లో ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2010లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబర్‌ 13, 2011న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ పదవీకాలం జనవరి 3తో ముగియడంతో ఆయన స్థానంలో ఖెహర్‌ నేడు బాధ్యతలు చేపట్టారు. 2017 ఆగస్టు 28న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com