ప్రవాసాంధ్రులకు ఆధార్ కష్టాలు-TNI ప్రత్యేకం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్టాలకు సంబంధించి విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల నుండి వివిధ అభివృద్ధి పథకాలకు విరాళాలను సేకరించడంలో ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ధ వారి సమస్యలు పరిష్కారంలో చూపించడమే లేదు.

*** ప్రవాసాంధ్రులు ప్రస్తుతం ఉన్న ఆధార్ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.వీటిలో ప్రధానమైనది భూముల, ఇతర ఆస్తులు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశం. భారతదేశంలో ఆధార్ కార్డ్ పొందాలంటే అంతకు ముందు ఆరు నెలలు పాటు ఖచ్చితంగా ఈ దేశంలో నివసించి ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రవాసాంధ్రులకు ఆధార్ పొందడంలో తీవ్ర ఇబ్బందిగా మారింది. భూములు, ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా రిజిస్టార్ కార్యాలయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించారు. ఆధార్ నంబరు లేకపోతే రిజిస్ట్రేషన్ జరగని విధంగా సాఫ్ట్ వేర్ రూపొందించారు. చాలా మంది ప్రవాసాంధ్రులకు భారతదేశంలో తమ పూర్వీకుల ద్వారా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన వారు ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకోవాలంటే వీలు కావడం లేదు. ఆలాగని ఆధార్ కార్డు పొందాలంటే వారికి ఉన్న నిబంధనలు అనుమతించడం లేదు. ఒక్క రిజిస్ట్రేషన్ శాఖలోనే కాకుండా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఆధార్ నంబరునే అడుగుతున్నారు.

*** ప్రవాసాంధ్రులుకు మినహాయింపు ఇవ్వాలి—డా.నల్లూరి ప్రసాద్
ప్రవాసాంధ్రులుకు ఆధార్ సదుపాయం నుండి మినహాయింపు ఇవ్వాలని అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు, తానా ట్రస్ట్ బోర్డు సభ్యుడు డా.నల్లూరి ప్రసాద్ డిమాండ్ చేశారు. దాదాపు 30-40 సంవత్సరాల నుండి విదేశాలలో నివసిస్తున్న తమలాంటి వారికీ స్వరాష్ట్రంలో ఉన్న ఆస్తులను అమ్ముకోవాలంటే వీలు కావడం లేదని ఇతర కార్యకలాపాలకు ఆధార్ లింకు పెడుతున్నారని ఈ నిబంధనను ఎత్తివేయాలని డా. ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలోని రిజిస్ట్రేషన్ల శాఖలో ఆధార్ అడుగుతున్నారని మిగిలిన రాష్ట్రాల్లో ఈ నిబంధన లేదని ఆయన తెలిపారు. తక్షణమే ఆధార్ కష్టాల నుండి తమను బయటపడేయాలని కోరారు. ప్రవాసుల వద్ద ఉన్న పాస్‌పోర్ట్‌లు, పాన్ కార్డులను ఆధార్‌కు బదులుగా స్వీకరించాలని ఆయన కోరారు.

pdf document: uidai.pdf.pdf
tags: adhar aadhaar nris aadhaar andhra telangana nris not possible

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com