ప్రవాసాంధ్రుల విరాళాలు పూర్తిగా సద్వినియోగం-TNIతో కోమటి జయరాం

*1000 డిజిటల్ తరగతుల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల కోమటి జయరాం ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావులు ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. 1000 డిజిటల్ తరగతుల నిర్మాణానికి ప్రవాసాంధ్రుల నుండి హామీలు లభించాయని కోమటి జయరాం TNIకి తెలిపారు. ప్రవాసాంధ్రులు పెట్టే పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, వారు ఇచ్చిన విరాళాలను వారు కోరుకున్న ప్రాంతాల్లోనే పూర్తిగా ఖర్చు చేస్తామని జయరాం తెలిపారు. ప్రవాసాంధ్రులు ఇచ్చిన విరాళాలు 100 శాతం సద్వినియోగం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని జయరాం తెలిపారు. అమెరికాలోని ప్రవాసాంధ్రుల నుండి విరాళాలు సేకరించి వాటిని రాష్ట్రంలో ఉన్న జన్మభూమి కార్యక్రమాలకు తరలించి ఆ పనులను పర్యవేక్షించడం కోసం అమెరికా నలుమూలల నుండి 17 మంది జన్మభూమి సమన్వయకర్తలను నియమించినట్లు అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. జన్మభూమి పథకం క్రింద రాష్ట్రంలో ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రవాసాంధ్రుల విరాళాలతో డిజిటల్ తరగతుల ఏర్పాటు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి తదితర కార్యక్రమాలను తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు కోమటి జయరాం తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు 1000 డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వచ్చారని వీటన్నింటినీ వచ్చే సెప్టెంబెర్ ఆఖరు లోపుగా పూర్తి చేస్తామని జయరాం తెలిపారు. అమెరికాలో నియమితులైన జన్మభూమి కోఆర్డినటర్లు ప్రవాసాంధ్రులకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా పని చేస్తారని, ప్రవాసాంధ్రులు ఇచ్చిన విరాళాలు పూర్తిగా సద్వినియోగం అయ్యేటట్లు చూస్తారని జయరాం తెలిపారు.
అమెరికాలో జన్మభూమి సమన్వయకర్తలు వీరే:
కానూరు హేమ, పుసులూరి సుమంత్, కాకర్ల రజనీకాంత్, పోలవరపు శ్రీకాంత్, ఉప్పుటూరి రాంచౌదరి, కె. లోకేష్ నాయుడు, సునీల్ పంత్ర, మొవ్వ రవి కిరణ్, ముప్పనేని సుబ్బారావ్, గొంపా కృష్ణ, వట్టిగుంట కేశవ, చెదలవాడ ప్రదీప్, పైలా ప్రసాద్, పైలా జోగినాయుడు , కరుటూరి సాయి విజయరాం చౌదరి , కరుటూరి అశ్విని కుమార్, డా. అప్పలనేని వసుంధర

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com