ప్రవాసుడికి నాట్స్ ఆర్థిక సాయం

కుమార్తె కుటుంబాన్ని సందర్శించే నిమిత్తం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర శాన్‌యాంటోనియో నగరానికి పర్యాటకుడిగా వచ్చిన పుప్పాల విష్ణు సూర్యప్రకాశరావు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. మెదడు సంబంధిత వ్యాధిగా నిర్ధారణ చేసిన వైద్యులు ఆయనకు అయిదు శస్త్రచికిత్సలు నిర్వహించారు. చికిత్స ఖర్చును భరించలేని పుప్పాల కుటుంబసభ్యులు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) హెల్ప్‌లైన్‌ను సంప్రదించగా బోర్డు ఆఫ్ డైరక్టర్ డా.కొర్రపాటి మధు, బోర్డు కార్యదర్శి అప్పసాని శ్రీధర్, హెల్ప్‌లైన్ సమన్వయకర్త గరిమెళ్ల హరీందర్ తదితరుల చొరవతో నిధుల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన 15వేల డాలర్ల చెక్కును ప్రకాశరావు కుటుంబసభ్యులకు నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి, నాట్స్ సహాయ కోశాధికారి శేఖర్ అన్నే, నాట్స్ డాలస్ విభాగ సమన్వ్యకర్త రామకృష్ణ మర్నేని, కిషోర్ వీరగంధం తదితరులు అందించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com