ప్రవాసులతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెన్సిల్వేనియా ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తెలంగాణ అభివృద్ధి గురించి , మరియు ఇబ్రహీంపట్నం నియెజకవర్గం లో ఏర్పాటు కాబోవుతున్న ఫార్మా కంపెనీలు , పలు ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ గురించి చర్చించారు. దీని వల్ల ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. నియోజకవర్గానికి చెందిన ప్రవాసులు జంబుల విలాస్ రెడ్డి, సందీప్ రెడ్డి , నరసింహ దొంతి రెడ్డి , కిరణ్ లు కలిసి నియెజకవర్గంలో గల పలు సమస్యలుకు ఇంకా త్వరగా పరిష్కారము చేయాలని వినతిపత్రాన్ని అందించారు. హైద్రాబాద్ నుండి ఇబ్రహీంపట్నం మీదుగా నాగార్జున సాగర్ కి మెట్రో రైల్వే లైన్ వచ్చే విధంగా కేంద్రంతో చర్చించవల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నరసింహ దొంతిరెడ్డి, విలాస్ రెడ్డి, సందీప్, గంగసాని రాజేశ్వర్, రాఘవరెడ్డి, కిరణ్, రమణరెడ్డి, వంశీ, శ్రీధర్ గుడాల, రామ్మోహన్ రెడ్డి, టాటా, ప్రదీప్, దిగంబర్, ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com