ప్రవాసులు సులువుగా భారతదేశంలో గృహ రుణాలు

చదువు, ఉద్యోగం పేరిట నేడు ఎంతో మంది విదేశాల బాట పడుతున్నారు. మంచి అవకాశాలు లభించడంతో చాలా మంది అక్కడే స్థిర పడుతున్నారు. కాస్త సంపాదన ప్రారంభించగానే పెట్టుబడి రూపంలోకి మార్చుతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా స్వదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. భారత ప్రభుత్వం వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.ఫెమా ( ఫారెన్ ఎక్సెంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999) ప్రకారం, ప్రవాస భారతీయుడు (ఎన్‌ఆర్‌ఐ) లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి (పీఐవో) రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సంబంధిత పత్రాలు చూపడంతో పాటు, ఇతర నిబంధనలను పాటించాలి. కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనల ప్రకారం, కచ్చితంగా పాస్‌పోర్టు, చిరునామా, పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) జిరాక్స్ ప్రతులను పొందుపరచాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న సొంత నివాసం లేదా అద్దె నివాసం చిరునామా పత్రాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. ఇక చెల్లింపుల విషయంలో విదేశీ మారకద్రవ్యం చేసేందుకు అనుమతి పొందిన బ్యాంకు నుంచి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అవసరమైనన్ని ఖాతాలు తెరిచేందుకు భారత ప్రభుత్వం వీలు కల్పించింది.అయితే దీనికి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం ఉండదు. లావాదేవీలు జరిపేందుకు గాను ఎన్‌ఆర్‌వో అకౌంట్‌ను కలిగి ఉండాలి. ఇక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులను చెల్లించాలంటే తప్పకుండా ఎన్‌ఆర్‌వో/ఎన్‌ఆర్‌ఈ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ/ నాన్ రెసిడెంట్ రూపీ) ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపులు ట్రావెలర్స్ చెక్, లేదా ఫారెన్ కరెన్సీ నోట్ల రూపంలో చేసేందుకు వీలు లేదు. వ్యవసాయ భూములు, ఫాం హౌజ్ ప్లాంటేషన్ ప్రాపర్టీ కొనుగోలు, భారతీయుడి చేత బహుమతి రూపంలో లేదా భారత్‌కు చెందిన ఇతర దేశంలో ఉన్న వ్యక్తి చేత బహుమతి పొందడం వంటివి ఎన్‌ఆర్‌ఐ, పీఐవోకు సాధ్యపడదు. ఇక ఇన్వెస్ట్ చేసే సమయంలో సంబంధిత పత్రాలతో పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఆస్తుల గత టైటిల్ డీడ్‌లను, రెవెన్యూ రికార్డులను, ల్యాండ్ రికార్డులను, లాయర్ ద్వారా తీసుకున్న నో డ్యూ సర్టిఫికేట్ వంటివి జత చేయాల్సి ఉంటుంది. ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఎదురైనా చార్టెడ్ అకౌంట్స్, లాయర్ల సలహా కోరేందుకు వీరికి అవకాశం ఉంటుంది. గుర్తింపు కలిగిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి గృహ రుణం పొందేందుకు ఎన్‌ఆర్‌ఐ కూడా అర్హుడే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com