ప్రవాసుల సేవలు పేదలకు ఉపయోగపడాలి-తానా అధ్యక్షుడు తాళ్ల్లూరి జయశేఖర్


పేద విద్యార్థులకు సాయపడేందుకు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధ్దికి ఎన్‌ఆర్‌లు పాటు పడేందుకే ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నామని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఎన్‌ఆర్‌ఐ తల్లి దండ్రుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు మెరుగైన చదువులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో చాలా మంది పిల్లలు ఇతర దేశాలలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. అక్కడ వారంతా మంచిగా ఉండాలని వారి బాగోగులు కూడా మనం ఇక్కడ ఉండి చూసుకోవాలని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చి సేవలు చేస్తే అది పేద ప్రజలకు ఉపయోగపడాలన్నారు. బాలికల హాస్టల్స్‌లో శానిటరీ ప్యాడ్స్ అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు వితరణ చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో క్యాన్సర్ బాధితుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ సేవలు మన జిల్లాకు ఉపయోగపడే విదంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో కమిటీ వేసి అందరికీ సేవలు అందేలా చూడాలన్నదే కమిటీ లక్ష్యమని అన్నారు. సమావేశంలో జిల్లా ఎన్‌ఆర్‌ఐ తల్లిదండ్రుల ఆత్మీయ అతిథులు తాళ్లూరి పంచాక్షరయ్య, కంచర్ల చంద్రశేఖర్, జేవీఎస్ చౌదరి, కోనేరు పూర్ణచంద్రరావు, సలీం, డాక్టర్ రమేష్ బాబు, గుండా శ్రీనివాస్, చావా లక్ష్మీనారాయణ, డాక్టర్ విజేందర్‌రావు, అత్తలూరి ఉమామహేశ్వరరావు, గోపాలరెడ్డి, సీతాప్రసాద్, లగడపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.












More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com