ప్రవాస జన సైనికులతో పవన్ భేటీ


జనసేన ఎన్ఆర్‌ఐ వింగ్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలను పార్టీకి నిధుల బ్యాంక్‌గా చూడబోమని స్పష్టం చేశారు. పార్టీ నెట్‌వర్కింగ్‌లో సహాయపడాలని కోరామన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్నారైల సహాయం ఎంతో అవసరమని తెలిపారు. ఎన్నారైల నెట్‌వర్కింగ్‌ను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నారైల ప్రొత్సాహం జనసేనకు చాలా అవసరమన్నారు. కావాలని నేను తప్పులు చేయను… ఒకవేళ తప్పు చేస్తే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరతానన్నారు. నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతానని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విబేధాలు లేవన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com