ఆదర్శంగా నిలుస్తున్నఅజో–విభో–కందాళం ఫౌండేషన్

అమెరికాకు చెందిన ‘అప్పజోస్యుల’, ‘విష్ణుబొట్ల’ ‘కందాళం’ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో గత 24 సంవత్సరాలనుండి నిర్వహిస్తున్న కళాసేవ మిగిలిన ప్రవాస తెలుగు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అజో – విభో – కందాళం ఫౌండేషన్ 1993వ సంవత్సరంలో ఆవిర్భవించింది. గత 24సంవత్సరాలుగా “ప్రతిభామూర్తి జీవితకాల సాధన” సత్కరోత్సవాలను ఆంధ్రదేశంలోని వివిధ నగరాలలో నిర్వహిస్తుంది. సాహిత్య – కళా – సాంస్కృతిక – సాంఘీక సేవా రంగాలలో ప్రతిఫలం గానీ ప్రయోజనం గానీ ఆశించక స్వీయప్రజ్ఞ సమున్వేషంతో ఒక జీవితకాలం తమ సృజనాత్మక ప్రతిభను నెలకొల్పిన వారిని “ప్రతిభామూర్తి”గా సత్కరించడం ఈ పురస్కార లక్ష్యం- ఆశయం. పురస్కార గ్రహితను ప్రశంసా పత్రము-జ్ఞాపిక-లక్ష రూపాయల నగదును అజో-విభో-కందాళం సంస్థ అందజేస్తుంది. 2003 నుంచి ఆంధ్ర భాషలో కృషి చేసిన వారికీ “విశిష్ట సహితీ మూర్తి జీవితకాల సాధన” పురస్కారాన్ని, ‘ సరిలేరు నీకేవ్వరు’ విశిష్ట పురస్కారాలను అందజేస్తుంది. విశిష్ట సాహితీమూర్తి పురస్కార గ్రహితకు – 25 వేల రూపాయల నగదు, ‘సరిలేరు నీకేవ్వరు’ విశిష్ట పురస్కార గ్రహీతలకు ఒక్కక్కరికి 25 వేల రూపాయల నగదు అందజేస్తుంది. తెలుగు నాటకరంగానికి దాదాపు ముప్పై-నలబై సంవత్సరాల కాలం విశేష సేవలందించిన వారిని గుర్తించి గౌరవించాలనే లక్ష్యంతో 2001లో ‘రంగస్థల సేవాముర్తి’ జీవితకాల సాధన పురస్కారా’నికి అజో-విభో-కందాళం సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ పురస్కారానికి రంగస్థల నటులు, దర్శకులు, నాటక రచయితలు, సంగీత – ఆహ్వార్యాది రంగస్తల వనరులు సమకూర్చే కళాకారులు ఎవరైనా అర్హులే. పురస్కార గ్రహీతకు జ్ఞాపిక – పదివేల రూపాయల నగదు బహుమానం. మేం తెలుగువాళ్ళం, తెలుగు సాహిత్యం- తెలుగు సంసృతి, తెలుగువారి సంస్కార మహితమైన- సామాజిక విహితమైన జీవనయానం మాకు అభీప్సితఒ, తెలుగు అభ్యుదయం- పేరు ప్రతిష్టలు- విలక్షణ వ్యక్తిత్వం, కళా-సాహిత్య- సంగీతాది వివిధ జీవన రంగాలలో వారు సాధించిన ఘనతలు – గౌరవాలు మేము ఎంతో ఇష్టంగా చెప్పుకుంటాఒ, వాళ్లకు సర్వాతనా నమస్కరిస్తాం-సత్కరిస్తాం అంటున్నది అజో-విభో కందాళం ఫౌండేషన్.
* అజో-విభో, కందాళం సేవలు అమోగం- మండలి
గత 24 సంవత్సరాలనుండి ఈ మూడు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తున్న కళా సేవ అద్భుతమైనదని ఆంధ్ర రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ ప్రసంసించారు. పాయకరావుపేటలో ఈ సంస్తల ఆధ్వర్యంలో నిర్వహించిన 24 వ రాష్ట్ర స్తాయి నాటక పోటీల ముగింపు సభలో బుద్దప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి సంపాదకులు యఒ.వి.ఆర్. శాస్త్రికి ప్రతిభామూర్తి పురస్కారోత్సవం అందచేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు గొల్లపూడి మారుతీరావు, ప్రకాశ్ విద్య సంస్తల అధినేత పి.ప్రకాశ్, వోలేటి పార్వతీశఒ తదితరులు పాల్గొన్నారు.
More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com