ప్రాణత్యాగం వద్దు. నిజాయితీ చాలు.

మాపై సీబీఐ విచారణ జరపించాలని కేంద్రాన్ని కోరుతున్నారు…పోలవరంపై ఏ విచారణకైనా సిద్ధం. ప్రాణత్యాగం చేసైనా ప్రాజెక్టు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షనేత జగన్‌ చేయించిన ఫిర్యాదుల కారణంగానే పోలవరం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రాజెక్టు కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని వెల్లడించారు. పోలవరం పనులు ఇప్పటికి 54.4శాతం పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం టెండర్లలో బేరసారాలు కుదరకే వైకాపా పుట్టిందని ఉమా విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com