ప్రియా ఫిదా హోగయా

అగ్ర కథానాయిక, తన ప్రియురాలు నయనతారపై దర్శకుడు విగ్నేశ్‌‌ శివాన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. నయన్‌ నటించిన సినిమా ‘కోలమావు కోకిల’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఈ నెలలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. పాపులర్‌ అమెరికన్‌ షో ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు విగ్నేశ్‌ సాహిత్యం అందించారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలో నయన్‌ స్టిల్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నయనతార నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. కొత్త కథలు, దర్శకులపైన నీకున్న నమ్మకం, తీసుకునే నిర్ణయం, తెరపై నీ ప్రదర్శన.. స్ఫూర్తిదాయకం. నీ ఎక్స్‌ప్రెషన్స్‌కు పాటలు రావడం సంతోషంగా ఉంది. ఎమోషనల్‌ స్టోరీ రాసిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, చక్కటి సంగీతం అందించిన అనిరుధ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని విగ్నేష్‌ పేర్కొన్నారు. తనకు కాబోయే భర్త విగ్నేశే‌ అని నయన్‌ ఓ అవార్డుల కార్యక్రమంలో పరోక్షంగా చెప్పారు. ‘నాకు కాబోయే భర్తకు ధన్యవాదాలు’ అని ఆయన్ను ఉద్దేశించి అన్నారు. త్వరలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. నయన్‌-విగ్నేశ్‌ కలిసి అనేక సార్లు విహారయాత్రలకు వెళ్లారు. ఇలా వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలను విగ్నేశ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com