ప్రీమియం యాక్సెస్

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సోమవారం ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు. వన్‌ప్లస్‌ సీఈవో పీటె లాతో బిగ్‌బీ మాట్లాడుతున్న ఫొటో అది. అందులో అమితాబ్‌, పీటె చేతుల్లో రెండు ఫోన్లు ఉన్నాయి. దీంతో అవి త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ 6 ఫోన్లే అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ ఈ నెల16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ మరుసటిరోజే అంటే మే 17న భారత్‌లోకి రానుంది. అయితే ఈ వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ ఇలా ఉండనుంది అంటూ ఇప్పటికే చాలా ఫొటోలు బయటకొచ్చాయి. తాజాగా వన్‌ప్లస్‌కు ప్రచారకర్త అయిన అమితాబ్‌ చేతుల్లో ఉన్న ఫోన్‌ కూడా ఇంతకుముందు లీకైన ఫొటోల్లాగే ఉండటంతో వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమితాబ్‌ ట్వీట్ చేసిన ఫొటోలో ఆయన నలుపు రంగు ఫోన్‌, పీటె లా తెలుపు రంగు ఫోన్‌ పట్టుకున్నారు. దీంతో ఈ రెండు రంగుల్లో ఫోన్‌ విడుదల కానుందని వినియోగదారులు భావిస్తున్నారు. అయితే పోస్టు చేసిన కొద్ది సేపటికే ఈ ట్వీట్‌ను అమితాబ్‌ తన ఖాతా నుంచి తొలగించారు. ఆ తర్వాత పీటె లాతో కలిసి దిగిన సెల్ఫీని పోస్టు చేశారు. అయినప్పటికీ ఆ ఫోన్‌ పట్టుకున్న ఫొటో వైరల్‌గా మారింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com